సౌత్ మోపూరులో రక్షిత మంచినీటి పధకం

నెల్లూరు

ssv news

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మన్నవరప్పాడు రోడ్డుకు శంకుస్థాపన మరియు సౌత్ మోపూరులో రక్షిత మంచినీటి పధకంను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఇరిగేషన్ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్, ఐ.టి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరియు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గార్లు.

🔹 కొత్తూరు నుండి సౌత్ మోపూరు వరకు వందలాది కార్లతో జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఇరిగేషన్ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్, ఐ.టి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గార్లకు స్వాగత ర్యాలీ నిర్వహించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔹 సౌత్ మోపూరు బి.సి. కాలనీ ప్రజలను ఏళ్ళ తరబడి వేధిస్తున్న 11కే.వి. విద్యుత్ లైన్ల సమస్యను జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి దృష్టికి తీసుకొనివెళ్ళిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 ఏళ్లతరబడి వేధిస్తున్న ఈ 11 కే.వి. విద్యుత్ వైర్ల సమస్యను వారంలోగా పరిష్కరిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హామీ ఇచ్చిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి.

🔹 నెల్లూరు రూరల్ లో ప్రతి పంచాయతీకి కోటి రూపాయలతో భూగర్భ డ్రైనేజీ పథకం. మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

🔹 4 గ్రామాలకు అతి త్వరలో ఎత్తిపోతల ద్వారా సాగునీరు పథకాలకు శంకుస్థాపన. మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

🔹 మొగళ్లపాలెంలో క్రీడా కాంప్లెక్స్ ను త్వరగా నిర్మించి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంత్రి గౌతమ్ రెడ్డి ని కోరిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

🔹 మొగళ్లపాలెంలో క్రీడా కాంప్లెక్స్ నిర్మాణాన్ని త్వరగా నిర్మిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి హామీ ఇచ్చిన మంత్రి గౌతమ్ రెడ్డి.

🔹 వై.ఎస్.ఆర్. ఆసరా క్రింద రూరల్ మండల సంఘమిత్ర సభ్యులకు 10 కోట్ల రూపాయల చెక్కును అందించిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఇరిగేషన్ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్, ఐ.టి. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *