ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం వేడుకలు

ఆంధ్రప్రదేశ్

SSV NEWS తాడేపల్లి
నవంబర్‌ 01.

–పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర్ అవతరణ దినోత్సవం వేడుకలు
–జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన పార్టీ సీనియర్‌ నేత శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.
–అమరజీవి పొట్టిశ్రీరాములు,మహాత్మాగాంధి,దివంగత వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖమంత్రి శ్రీ అనిల్‌ కుమార్‌ యాదవ్,శాసనమండలి ఛీఫ్‌ విప్‌ శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, స్కిల్‌ డెవలప్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ చల్లామధుసూధన్‌ రెడ్డి, ఎంఎల్‌ఏ శ్రీ కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి,ఏపి నాన్‌ రెసిడెంట్‌ తెలుగుసొసైటి అధ్యక్షుడు శ్రీ మేడపాటి వెంకట్‌ పలువురు పార్టీ నేతలు.

–రాష్ట్ర విభజన జరిగినప్పడు తెలంగాణా ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయింది గాని ఆంధ్రప్రదేశ్‌ అలాగే ఉందని అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రఅవతరణోత్సవాలు ఐదేళ్లపాటు నిలిపివేసిందని రాష్ట్ర ఇరిగేషన్‌ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు.
–ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర అవతరణ దినోత్సవాలు మూడు రోజులపాటు జరపాలని నిర్ణయించారన్నారు.పొట్టిశ్రీరాములు త్యాగం ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని తెలియచేశారు.ఆయన సేవలను త్యాగాలను రాష్ట్రప్రజలు గుర్తించేవిధంగా అవతరణోత్సవాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రిగారికి అభినందనలు చెబుతున్నానని అన్నారు.
–శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతన రాష్ట్రం ఏర్పడ ్డతర్వాత మొట్టమొదటసారిగా రాష్ట్రఅవతరణ దినోత్సవాలు జరుపుకుంటున్నాం.2014 నుంచి 2019 వరకు అవతరణ ఉత్సవాలు జరగలేదు.ఐదేళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం వీటిని జరపకుండా నిర్లక్ష్యం చేసింది. 1956 నవంబర్‌ 1 న రాష్ట్రం ఏర్పడింది కాబట్టి అదే రోజు ఈ అవతరణోత్సవాలు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ గారు నిర్ణయించారు.తెలుగువారు కలలుగన్న భాషాప్రయుక్త రాష్ట్రం ఏర్పడాలనే ఆకాంక్ష నేరవేరిన రోజు ఇది.
1953లో ఆంధ్రరాష్ట్రం 11 జిల్లాలతో కర్నూలు హెడ్‌ క్వార్టర్స్‌ గా ఉంది.ఆ తర్యాత కూడా ఉద్యమాలు జరగుతున్నాయి.ఎందుకంటే కేవలం 11 జిల్లాలలోతోనే కాదు తెలుగుమాట్లాడే ప్రజలందరూ ఒక గొడుగు కిందకు రావాలని విశాలాంధ్ర ఏర్పడాలనే బలమైన కోరిక ఉంది.ఈ ఉద్యమాలు చూసి ఆనాటి కేంద్రప్రభుత్వం ధార్‌ కమిటీ వేశారు.ఆ కమిటీ కూడా తెలుగుమాట్లాడేవారి ఆకాంక్షను గుర్తించారు కాని నిర్ణయం తీసుకోలేకపోయారు.1952లో ధార్‌ కమిటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి జైపూర్‌ లో జరిగిన కాంగ్రెస్‌ కమిటీ నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చారు.ఎట్టిపరిస్దితులలో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడాలని అనుకున్నారు.దానిపరిణామం నేపధ్యంలోనే పాక్షికంగా 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
దాని తర్వాత అనూహ్యంగా ఆంధ్రుల మనోభావాలు దెబ్బతిన్నాయి అని ఉద్యమాలు ఊపందుకున్నాయి.వాటికి ఊపిరిపోశాడు స్వర్గీయ పొట్టిశ్రీరాములు.స్వాతంత్య్రసమరంలో పాల్గొన్నవాళ్లు,గతంలో పోరాటాలు చేసినవారు పొట్టిశ్రీరాముల పోరాటాన్ని మద్దతు పలికారు.ఒకటి కాదు రెండు రోజులు కాదు 58 రోజులు ఆమరదీక్షద్వారా పోరాటం కొనసాగించారు.ఆ తర్వాత అశువులు బాశారు.ఇక జాప్యం చేస్తే బాగోలేదు అని జవహర్‌ లాల్‌ నెహ్రూగారు అనౌన్స్‌ చేశారు.కాని దాంతో తృప్తిపడక స్టేట్స్‌ రీఆర్గనైజేషన్‌ కమిటీ వేసి,ఆ కమిటీతో పరిశీలించమన్న తర్వాత జసిస్‌ సజలాని కమిటి వేశారు.ఆ కమిటి స్పష్టంగా చెప్పింది ఇంకా అనేక డిమాండ్స్‌ ఉన్నాయన్నారు.ఇవన్నీ పరిస్దితులలో నేపధ్యంలో విశాలఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది.ఈరోజు జగన్‌ గారు మూడురోజులపాటు ఆంధ్రఅవతరణ దినోత్సవాలు నిర్వహించాలని భావించడం నిజంగా అభినందించదగ్గ అంశం.
కార్యక్రమంలో పార్టీ రాష్ట్రఅధికారప్రతినిధి శ్రీ పద్మజారెడ్డి,ఎస్సీసెల్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీ కాలేపుల్లారావు పలువురు అనుబంధవిభాగాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *