పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – పాటూరు పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు

నెల్లూరు

ssv news

కోవూరు : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పాటూరు పంచాయతి సెక్రటరీ శ్రీనివాసులు తెలిపారు. కోవూరు మండలంలోని పాటూరు సచివాలయ ప్రాంగణంలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సెక్రటరీ శ్రీనివాసులు ,ఆర్ ఐ రాకేష్ , అడిషనల్ సెక్రటరీ కరుణ కుమారి, వీఆర్వో రమణమ్మ సచివాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు . అనంతరం పంచాయతి సెక్రటరీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం పర్యావరణం కాలుష్య కోరల్లో చిక్కుకుని , మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. కాలుష్య నివారణకు ప్రతిఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకుని గ్రామస్తులకు అవగాహనా కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . అగ్రికల్చర్ అసిస్టెంట్ సుభాషిణి , హార్టికల్చర్ అసిస్టెంట్ మౌనిక, విమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీ మాధవీలత, డిజిటల్ అసిస్టెంట్ దిలీప్ , ఇంజనీరింగ్ అసిస్టెంట్ విశ్వతేజ, సర్వేయర్ సూర్యతేజ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వెంకటరాజ , ఏఎన్ఎం అనురాధ, సీవో శివ , గ్రామ వలంటీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *