షార్ట్ ఫిల్మ్, సినిమా అవకాశాల పేరుతో అమాయకులను వ్యభిచార రొంపిలోకి దించుతున్న ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన నెల్లూరు టౌన్ పోలీసులు

నెల్లూరు

షార్ట్ ఫిల్మ్, సినిమా అవకాశాల పేరుతో అమాయకులను వ్యభిచార రొంపిలోకి దించుతున్న
ఘరానా మోసగాడిని అరెస్ట్ చేసిన నెల్లూరు టౌన్ పోలీసులు
ఘరానా నేరస్తుడు నిర్వహిస్తున్న వేశ్య గృహాలపై ఏక కాలంలో దాడులు చేసిన నెల్లూరు టౌన్ పోలీసులు
షార్ట్ ఫిల్మ్ మేకర్ ముసుగులో యువతిలకు ఎర వేసి ఆపై బ్లాక్మెయిల్ చేసి లోబరుచుకుంటున్న వైనం
ఆ విధంగా లోబరుచుకున్న మైనర్ బాలికలపై అత్యాచారాలు
8 మంది నిర్వాహకులు, 5 మంది విటులు అరెస్ట్ మరియు 7 గురు భాదితులకు రిస్క్యు హోం కు తరలింపు
తేది 06.11.2019 న రాత్రి 8.00 గంటలకు కు కోవూరు పట్టణం, వడ్డిపాలెంకి చెందిన ఒక మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో ముద్దాయి షేక్ జాకీర్ హుస్సేన్ Cr.No.323/19 U/s 376, 2(i), 506 మరియు Sec 6 r/w 5(L) POCSO-2012 కేసు నమోదు చేయుట అయినది. విచారణలో భాగంగా విచారణ అధికారి అయిన నెల్లూరు టౌన్ డి.యస్.పి. జె.శ్రీనివాస రెడ్డి గారు మరియు ప్రత్యేక అధికారి ఇన్స్పెక్టర్ శ్రీ ఐ.శ్రీనివాసన్ ఆధ్వర్యంలో ముద్దాయిని 07.11.2019 వ తేదీన ఉదయం 10.00 గంటలకు కు దక్షిణ బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద గల NHAI భవనం గేటు వద్ద ముద్దాయిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తదుపరి విచారణలో ముద్దాయి నెల్లూరు స్టార్ట్ గన్ పేరుతో షార్ట్ ఫిల్మ్ లు తీస్తున్నానని, సినిమా అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిలకు నమ్మించి, శారీరకంగా అనుభవించి సదరు చర్యలు భాదితులకు తెలియకుండా వీడియో రికార్డు చేసి వాటి ద్వారా వారిని బ్లాక్మెయిల్ చేసి వ్యభిచార వృత్తిలోకి దింపి వారి ద్వారానే పట్టణంలో వ్యభిచార గృహాలు నడుపుతున్నట్లు, తనకు తెలిసిన అమ్మాయిలతో పాటు ఇతర ప్రదేశముల నుండి కూడా కొంత మంది అమ్మాయిలను పిలిపించి వారితో వ్యభిచారం చేయిస్తూ దానిపై వచ్చిన సంపాదనను తాను తీసుకుంటూ, కొంత వ్యభిచార గృహాలు నడిపిస్తున్న వారికి, కొంత బాధితులకు ఇస్తున్నట్లు తెలిపినాడు. ప్రస్తుతం ఇతని ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వ్యభిచార గృహాల నిర్వాహకుల వివరాల ప్రకారం
చిన్న బజారు పి.యస్. పరిధిలోని సి.ఐ. శ్రీ మధు బాబు ఆధ్వర్యంలో కోటమిట్ట రోడ్డులో షేక్ నూరీ మరియు పొంగూరి సుమ నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి మొత్తం ముగ్గురు ముద్దాయిలను, ఒక బాధితురాలిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినారు.
అదేవిధంగా నవాబ్ పేట పి.యస్. , స్టోన్ హౌస్ శ్రీలక్ష్మి నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకురాలు అయిన శ్రీలక్ష్మిని, విటుడు నరసింహారావును ఇద్దరిని అదుపులోకి తీసుకోవడమయినది.
అదేవిధంగా దర్గామిట్ట పి.యస్. పరిధిలో పోస్టర్ కాలనీలో లక్ష్మీ మరియు హారిక నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకురాలు లక్ష్మి, హారిక ను మరియు కె.శ్రీనివాసులు అను ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం తీసుకోవడం జరిగినది.
అదే విధంగా వేదాయపాలెం పి.యస్. పరిధిలో జ్యోతి నగర్ లో కె.శ్రావణి మరియు శ్రీనివాసులు నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకురాలు శ్రావణి మరియు శ్రీనివాసులను, విటుడు సునీల్ తో సహా ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగినది.
అదే విధంగా బాలాజీ నగర్ పి.యస్. పరిధిలో చిల్డ్రన్ పార్కు వద్ద ప్రియాంకా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకురాలు ప్రియాంక మరియు విటుడు వంశీకృష్ణను అదుపులోకి తీసుకోవడం జరిగినది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *