కర్నూల్ జిల్లా అవుకు మండలం మంగంపేట తాండ లోజలపాతం

ఆంధ్రప్రదేశ్ జాతీయం నెల్లూరు

☝ఈ జలపాతం ఒకసారి చూడండి ఇది ఎక్కడో వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలోనో కాదు మన పొరుగులోనే ఉన్న కర్నూల్ జిల్లా అవుకు మండలం మంగంపేట తాండ లోనిది. వింటూంటేనే విచిత్రంగా ఉంది కదు దీని కధకామంప్ విశేషాలేమో చూద్దాం పదండి.
బనగానపల్లె నుండి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో అవుకు మండలం మంగంపేట తాండ దెగ్గర సహజసిద్ధంగా ఏర్పడ్డ జలపాతం ఈ మంగంపేట జలపాతం. విషయనికొస్తే మొన్న కురిసిన భారీ వర్షాలకు అవుకు మండలం పైనఉన్న కొండల్లో నుంచి నీరు జాలువారి సహజసిద్ధంగా ఏర్పడిందే ఈ మంగంపేట జలపాతం
*బనగానపల్లె నుండి ప్యాపిలి కు వెళ్లే రహదారిలో యాగంటిపల్లె, దద్దనాల చెరువు దాటినా 2 కిలోమీటర్ల తరువాత ఎడమవైపు తిరిగి 6 కిలోమీటర్లు లోపలికి వెళ్తే మంగంపేట అనే చిన్న గ్రామం వస్తుంది అక్కడినుంచి 5 కిలోమీటర్లు మెటల్ రోడ్డు మీద వెళ్తే మనం ఆ జలపాతానికి చేరుకోవచ్చు. ఇది అంత సులభం కాదండోయ్ ఎందుకంటే ఇక్కడ ఇంకొక చిక్కుంది మనం ఆ జలపాతానికి చేరుకోవాలంటే బండి పార్కింగ్ చేసిన చోటునుండి సుమారుగా అర కిలోమీటర్ నీళ్లలో వెల్తెగాని మనం అక్కడికి చేరుకోలేము.
వాటర్ ఫాల్స్ నుండి క్రిందకు పడిన నీరు ఒక చిన్న కాలువలాగా ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి వాటర్ ఫాల్స్ కు వెళ్లాలంటే 500+ మీటర్లు నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళాలి. లోతు కూడా మోకాలు కిందికే ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు.
పారే నీరు కాబట్టి నీళ్లలో నడుచుకుంటూ వెళ్లిన ఏ ఇబ్బంది ఉండదు ఇదొక రకమైన థ్రిల్ లాగా, అడ్వెంచర్ లాగా భలే ఉంటుంది.
వాటర్ ఫాల్స్ దగ్గర చాలా విశాలమైన ప్రదేశం ఉన్నది కాబట్టి ఎక్కువ మంది వెళ్లిన ఎటువంటి ఇబ్బంది ఉండదు బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఎంత విశాలంగా ఉందో వీడియోలో చూడవచ్చు.
వర్షాకాలంలో మాత్రమే ఇవి పారుతాయి కాబట్టి ఇంకో 2 నుండి 3 నెలల వరకు మాత్రమే ఇవి చూడవచ్చని ఒకవేళ వర్షాలు పడితే ఇంకొన్ని ఎక్కువ రోజులు పారుతాయని అక్కడ నివసిస్తున్న స్థానికులు చేప్పారు. ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్, ఝల్లు ఝల్లుమని ఆ నీళ్ల శబ్దం, ప్రకృతి అందాల మధ్యలో ఒక కొత్తలోకనికి వెళ్ళామా అనే అనుభూతిని కలిగిస్తుంది.
ఈ జలపాతం వీక్షించడానికి సుమారుగా నంద్యాల, బనగానపల్లె, కర్నూలు, కడప జిల్లా తదితర ప్రాంతాలనుండి భారీ సంఖ్యలో ప్రకృతి ప్రియులు చేరుకుంటున్నారు ఇక సెలవు దినాలలో అయితే అస్సలు చెప్పాల్సిన పనేలేదు. ఇంకెందుకు ఆలస్యం మీరుకుడా వెళ్లి ఆ అందమైన అనుభూతిని ఆస్వాదించి రండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *