దృశ్యం సినిమా ను తలపించేలా ఈ మర్డర్ చేశారు

ఆంధ్రప్రదేశ్

ssv news

రజిత ను హత్య చేసిన తరువాత రజిత ఫోన్ నుండి

ప్రియుడు బాల్ రెడ్డి కి స్వయంగా కీర్తి ఫోన్ చేసి తల్లి లాగా మాట్లాడింది

నేను వైజాక్ కి వెల్లుతున్న, కీర్తి ఇంట్లో ఉంటుందని చెప్పి తల్లిగా మాట్లాడింది

హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మిస్సింగ్ కేసు కీలక మలుపు తిరిగింది.
కన్న కూతురే తల్లిని ప్రియుడితో కలిసి అతి దారుణంగా హత్య చేసింది.
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూర్ గ్రామంలో నివసించే రజిత, శ్రీనివాస్ రెడ్డి దంపతులకు కీర్తి అనే కుమార్తె కలదు. కీర్తి దిలీషుఖ్ నగర్లోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది.
కీర్తి కి ఇంటర్ చదివే సమయంలో అదే గ్రామంలో ఉండే బాల్ రెడ్డి అనే యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త శారీరక సంబంధానికి దారి తీయడంతో కీర్తి కడుపు వచ్చింది. దీంతో ఏమి చేయాలో తెలియక అదే గ్రామంలో నివచించే శశి కుమార్ అనే యువకుని సహాయంతో మహబూబ్ నగర్ జిల్లా అమన్ గల్ పట్టణంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో అబార్షన్ చేయించారు.
ఇదే అదునుగా భావించిన శశి కుమార్ కీర్తి ని బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకుని శారీరికంగా వాడుకునేవాడు.
అంతేకాకుండా శశి కుమార్ కీర్తి ని డబ్బుకోసం వేదించేవాడు.
ఈ నేపద్యంలో తల్లికి విషయం తెలియడంతో ఏమిచెయలో తెలియక ప్రియుడి తో కలిసి తల్లిని హతమార్చలని నిర్ణయం తీసుకుంది. మొదటిసారి తల్లికి నిద్ర మాత్రలు వేసి చంపాలని ప్రయత్నం చేసింది. అది విఫలం కావడంతో ప్రియుడి సహాయంతో చున్నీతో గొంతు నులిమి చంపేశారు. రెండు రోజులు బాడీని ఇంట్లోనే ఉంచి తర్వాత శశి కుమార్ కారులో మృతదేహాన్ని దుప్పటితో చుట్టి నల్గొండ జిల్లా రామన్న పేట రైల్వే ట్రాక్ పక్కన పడవేశారు.
ఏమి తెలియనట్లు ఈనెల 26 తారీకున కీర్తి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన తల్లి కనిపించడంలేదని పోలీసులకు తెలపడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు దర్యాప్తులో పోలీసులకు అనుమానం రావడంతో తీగ లాగితే డొంక కదిలినట్లు విషయం బయటకు వచ్చింది. దీంతో మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా నమోదు చేసి నిందితురాలైన కీర్తి తో పాటు ఆమె ఇద్దరు ప్రియులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *