బీద చూపు బి.జె.పి.వైపు..?

నెల్లూరు

Ssv news Kavali
కావాలి లో కార్యకర్తల గుసగుసలు..

కావలికి బీదా రాక !
కార్యకర్తలకు తెచ్చింది
ఏరువాక !!
——
గత కొంతకాలంగా రాజకీయాలకు
దూరంగా – పూర్తిగా వ్యాపార సామ్రాజ్యానికి పరిమితై వున్న మాజీశాసనసభ్యుడు , తెలుగుదేశం నాయకుడు బీదా మస్తానరావు 24 వతేది కావలికి రావడంతో తెలుగుదేశం కార్యకర్తల – నాయకుల కళ్ళల్లో కొత్త కాంతులు కనిపించాయి .
కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి సోదరుడు కుమారస్వామి రెడ్డి పెద్దకర్మ ను పురస్కరించుకొని బీదా మస్తానరావు తన వారసుడైన కుమారుడిని తోడ్కొని కావలి వచ్చారు . ప్రతాపకుమార్ రెడ్డి సోదరుడి పెద్దకర్మకు హాజరై ఆతర్వాత తాను బసచేసిన హోటల్ లో తెలుగుదేశం కార్యకర్తల తో చాలాసేపు పిచ్చాపాటి మాటలతో , కుశల ప్రశ్నలతో గడిపారు . బీదా కావలి రాక తెలుగుదేశం కార్యకరల్లో ఒక ఏరువాక తెచ్చిన పరిస్థితి ఏర్పరచింది .
త్వరలో మున్సిపల్ , పంచాయితీ ఎన్నికల ప్రకటనలు రానుండడంతో బీదా రాక ఒక ప్రత్యేకత సంతరించుకుంది . నేనున్నానంటూ …. బీదా ఆ పిచ్చాపాటిలో కార్యకర్తలకిచ్చిన భరోసా వారిలో వెలుగులు నింపింది .
మరి బీదా మళ్లీ ఎప్పుడొస్తాడో ఏమో గాని ప్రస్తుతానికి మాత్రం తెలుగుదేశం కార్యకర్తలు , ఛోటామోటా నాయకులు మాత్రం మా బీదా వస్తాడు – తెలుగుదేశం జెండా కావలిలో ఎగరేస్తాడు అన్న ధీమాను నిన్నటినుండి తెలుగుదేశం వాళ్ళు వ్యక్తం చేస్తుండడం మాత్రం కనిపిస్తుంది .

♦ కొసమెరుపు
——————–
బీదా మస్తానరావు త్వరలో బీజేపీ తీర్ధం తీసుకోబోతున్నాడని విస్తృత ప్రచారం జిల్లాలో జరుగుతుండడం గమనార్హం .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *