ఆత్మకూరు నియోజకవర్గంలో చెరువులు కాలువలు మరమ్మతులకు526.70 లక్షల తో ప్రతిపాదనలు: మంత్రి మేకపాటి

నెల్లూరు

నియోజకవర్గంలో చెరువులు కాలువలు మరమ్మతులకు526.70 లక్షల తో ప్రతిపాదనలు: మంత్రి మేకపాటి*

ఎస్.ఎస్.వి.
న్యూస్ (ఆత్మకూరు)
మహానేత వైఎస్సార్ పాలన వచ్చింది అనడానికి జిల్లాలోని అన్ని జలాశయాలు మరియు చెరువులు జలకళతో ఉండడమే నిదర్శనమని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న సోమశిల జలాశయం పది సంవత్సరముల తర్వాత పూర్తి సామర్థ్యం కలిగి ఉండడం పై రైతులు హర్షం వెలిబుచ్చారు.

రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం అన్న దానికి ఇది ఒక నిదర్శనం.

సోమశిల జలాశయం పూర్తి సామర్ధ్యం ఉండటంతో నియోజక నియోజకవర్గ పరిధిలో చెరువులు మరియు కాలువలు మరమ్మత్తులు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా సక్రమంగా సాగునీరు అందించుటకు నియోజకవర్గ పరిధిలో 38 పనులకు 526.70 లక్షలతో అంచనాలు తయారు చేసి మంజూరు నిమిత్తం ప్రభుత్వానికి పంపడం జరిగిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *