ప్రభుత్వ పథకాలను ప్రజల దరిచేర్చండి

ఆంధ్రప్రదేశ్

(ప్రత్తిపాడుతూర్పుగోదావరి)

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల దరిచేర్చాలని తూర్పుగోదావరి జిల్లా భారతీయ పార్టీ సంస్థాగత ఎన్నికల సహాయ అధికారి డివి. సుర్యనారాయణరాజు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని
ప్రత్తిపాడులోని పార్టీ కార్యాలయంలో మండల ఎన్నికల సహాయ అధికారి దేవర రామకృష్ణ అధ్యక్షతన గురువారం పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. పోలింగ్ బూత్ కమిటీలను వెయ్యాలని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టిన రోజు సంధర్భంగా “సేవా సప్తాహం” కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ్ భారత్, ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం, రొట్టె, పాలు, పండ్ల పంపిణీ, ప్లాస్టిక్ వినియోగ నిరొధానికీ జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను పలువురు కార్యకర్తలు, నాయకులు చేస్తున్నారని అన్నారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి సింగిలిదేవి సత్తిరాజు, అద్దేపల్లి రాజా, దుళ్ల సత్యనారాయణ, దాసతొట్టి
జేసుదాసు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *